తెలంగాణ

telangana

ETV Bharat / business

జొమాటో ఇంటి భోజనాలు వచ్చేస్తున్నాయ్! - ఆన్​లైన్ ఫుడ్​

స్విగ్గీ తరహాలో మరో ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో ఇంటి వంటకాలు డెలివరీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జొమాటో తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇటీవల చేసిన ఓ ట్వీట్​ ఇందుకు ఊతమిస్తోంది.

జొమాటో

By

Published : Jul 9, 2019, 3:12 PM IST

ఇంటి వంటకాల డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తుందన్న ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో. ఇందుకు ప్రధాన కారణం ఆ సంస్థ చేసిన ఓ సరదా ట్వీట్​.

"అప్పుడప్పుడూ ఇంటి భోజనం కూడా తినండి" అంటూ జొమాటో అధికారిక ట్విటర్​ పేజీలో ఇటీవల ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్​కు స్పందిస్తూ.. ఆ సంస్థ సీఈఓ ప్రసంశలు కురిపించారు. దీనిపై దిగ్గజ టెక్ సంస్థలు జొమాటోను ట్యాగ్ చేస్తూ వరుస రీట్వీట్​లు చేశాయి.

ఈ నేపథ్యంలో.. స్విగ్గీ తరహాలోనే జొమాటో కూడా 'ఇంటి భోజనం' సేవలు అందించే పనిలో ఉందనే ఊహాగానాలు బలపడ్డాయి.

జొమాటో ప్రధాన ప్రత్యర్థి స్విగ్గీ ఇప్పటికే.. స్విగ్గీ డెయిలీ పేరుతో ఇంటి భోజన సేవలు అందిస్తుంది. ప్రస్తుతం రోజు, వారం, నెలవారీ చందాలతో ఈ సేవలను అందిస్తోంది స్విగ్గీ.

ఇంటి భోజనానికి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీగా డిమాండు ఉంది. ఇంటి షెఫ్​లతో వండించిన ఆహారంపై ఉద్యోగులు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చూడండి: భారత్​ వీడాలంటే రూ.18వేల కోట్లు కట్టాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details