తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ డిస్కౌంట్లకు స్విగ్గీ, జొమాటో గుడ్​బై! - ఎన్​ఆర్​ఏఐ

భారీ డిస్కౌంట్లకు స్వస్తి చెప్పనున్నాయి స్విగ్గీ, జొమాటో వంటి ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థలు. ఆఫర్లతో తమ వ్యాపారాలకు నష్టాలు వస్తున్నాయని రెస్టారెంట్లు చేస్తున్న సమ్మె విరమింపజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

స్విగ్గీ,జొమాటో

By

Published : Aug 21, 2019, 2:04 PM IST

Updated : Sep 27, 2019, 6:50 PM IST

ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ సంస్థల భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేస్తున్న 'లాగ్​ అవుట్​ సమ్మె'ను రెస్టారెంట్లు విరమించాయి. స్విగ్గీ, జొమాటో సహా పలు ఇతర సంస్థలతో జరిపిన చర్చలు సఫలమైనట్లు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్​ వెల్లడించింది.

సమ్మె ఎందుకంటే...

వినియోగదారులను ఆకర్షించేందుకు ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీ సంస్థలు భారీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లకు వచ్చి తినేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఈ ఆఫర్ల కారణంగానే తమ సంప్రదాయ వ్యాపారం దెబ్బతింటోందని దేశవ్యాప్తంగా 1,200లకు పైగా రెస్టారెంట్లు ఫుడ్​ డెలివరీ సంస్థలపై'లాగ్​ అవుట్​' సమ్మెకు దిగాయి.

దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్​కతా, గోవా, పుణే, గురుగ్రామ్, వడోదర పట్టణాల్లో జొమాటో, ఈజీడిన్నర్​, నియర్​బై, మ్యాజిక్ పిన్, గౌర్​మెట్​ పాస్​పోర్ట్ వంటి సంస్థలపై 'లాగ్ అవుట్'​ సమ్మె ప్రభావం అధికంగా పడింది.

చర్చ సాగిందిలా..

రెస్టారెంట్ల సమ్మెతో ఫుడ్​ డెలివరీ సంస్థలు దిగొచ్చి... రెస్టారెంట్ల యాజమానులు, జాతీయ రెస్టారెంట్​ ఆసోసియేషన్​తో(ఎన్​ఆర్​ఏఐ) ఇటీవల రెండు రోజులపాటు చర్చలు జరిపాయి. డిస్కౌంట్ల అంశమే సమ్మెకు కారణమని రెస్టారెంట్ల తరఫున ఎన్​ఆర్​ఏఐ వాదించింది. ప్రత్యేక ఆఫర్లతో పాటు, ఫుడ్​ డెలివరీ సంస్థలు పలు ప్యాకేజీలతో చందాదారులను సమకూర్చుకుంటున్నాయి. వారి నుంచి చందా తీసుకుని తక్కువ ధరకే ఫుడ్​డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. అవి తీసుకునే సబ్​స్క్రిప్షన్​లో తమకు ఎలాంటి వాటా ఇవ్వడం లేదని తెలిపాయి రెస్టారెంట్లు.

వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఫుడ్​ డెలివరీ సంస్థలు తమ భారీ డిస్కౌంట్లను పునఃసమీక్షిస్తామని రెస్టారెంట్లకు హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా రెస్టారెంట్లు 'లాగ్​ అవుట్ సమ్మె'ను విరమించాయి.

ఫుడ్​ డెలివరీ సంస్థల తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఉన్న భారీ డిస్కౌంట్లకు బ్రేక్​ పడనుంది.

ఇదీ చూడండి: ఐఆర్​సీటీసీకి మరో రెండు తేజస్​ రైళ్లు అప్పగింత!

Last Updated : Sep 27, 2019, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details