తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పతనమైన యస్​ బ్యాంకు షేర్లు - త్రైమాసి ఫలితాల ప్రభావం

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన యస్​ బ్యాంకు షేర్లు నేడు కుదేలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలో దాదాపు 30 శాతం మేర నష్టాలతో ట్రేడవుతున్నాయి.

యస్ బ్యాంకు

By

Published : Apr 30, 2019, 3:25 PM IST

ప్రైవేట్ బ్యాంకింగ్​ దిగ్గజం యస్​ బ్యాంకు షేర్లు నేడు భారీగా కుదేలయ్యాయి. ఇటీవల ప్రకటించిన 2018-19 నాల్గో త్రైమాసిక ఫలితాల్లో రూ.1,506.64 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది బ్యాంకు.

ముఖ్యంగా మొండి బకాయిలకు కేటాయించే ప్రొవిజన్లు పెరగటం బ్యాంకును భారీ నష్టాల్లోకి నెట్టింది.

వీటికి తోడు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బ్రోకరేజి రేటింగ్​ సంస్థ 'మోక్వారీ' యస్​ బ్యాంకు షేర్ల రేటింగ్​ను రెండంచెలు తగ్గించింది. ఈ నేపథ్యంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన షేర్లు మార్కెట్లు ఆరంభమైన కొద్దిసేపటికే దాదాపు 30 శాతం నష్టాల్లోకి జారుకున్నాయి.

సెన్సెక్స్​లో బ్యాంకు షేరు 29.34శాతం నష్టంతో రూ.167.75కు చేరింది. నిఫ్టీలోనూ 29.41 శాతం నష్టపోయి రూ.167.45 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details