తెలంగాణ

telangana

ETV Bharat / business

నాలుగు కెమెరాల​తో వస్తోన్న రెడ్​మీ నోట్​8 ప్రో - నాలుగు కెమెరాలు

స్మార్ట్​ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న నాలుగు కెమెరాల పోటీలోకి షోమీ ప్రవేశించింది. ఆగస్టు 29న రానున్న రెడ్​మీ నోట్​ 8 ప్రో మోడల్​ను వెనుకవైపు నాలుగు కెమెరాలతో తీసుకురానున్నట్లు షోమీ స్పష్టం చేసింది. ఈ కొత్త మోడల్​ పూర్తి వివరాలు మీకోసం.

నోట్​8 ప్రో

By

Published : Aug 27, 2019, 12:44 PM IST

Updated : Sep 28, 2019, 11:00 AM IST

రెడ్​మీ నోట్ శ్రేణిలో మరో కొత్త మోడల్​ను ఆవిష్కరించేందుకు చైనా స్మార్ట్​ఫోన్​ దిగ్గజం షోమీ సిద్ధమైంది. నోట్ సిరీస్​​లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని మోడళ్లకు దక్కిన ఆదరణ దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఫీచర్లతో... నోట్ ​8 ప్రో పేరుతో కొత్త మోడల్​ను తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో వెనుకవైపు నాలుగు కెమెరాల ట్రెండ్​ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నోట్​ 8 ప్రోలోనూ నాలుగు కెమెరాలు పొందుపరిచినట్లు షోమీ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఫోన్​ మొదట ఆగస్టు 29న చైనా మార్కెట్లో విడుదల కానుంది. భారత్​లో విడుదల తేదీ తెలియాల్సి ఉంది.

షోమీ వెల్లడించిన నోట్​8 ప్రో ఫీచర్లు ఇవే..

  • 64 మెగా పిక్సల్​తో వెనుకవైపు నాలుగు కెమెరాలు
  • పాప్-ఆప్​ సెల్ఫీ కెమెరా
  • స్నాప్​ డ్రాగన్ 700 ప్రాసెసర్​
  • ఆండ్రాయిడ్​ 9.0 పై
  • ఎంఐయూఐ 10
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్​ సపోర్ట్​
  • టైప్​ సీ యూఎస్​బీ

టెక్ వర్గాల అంచనాలు ఇలా...

6జీబీ/128జీబీ, 8జీబీ/128 జీబీలో రెండు వేరియంట్లు రానున్నాయి.
రూ.18,000, రూ.21,000 ధరల్లో లభించే అవకాశముంది.

ఇదీ చూడండి: ప్లాన్​ ఏదైనా.. వినోదం ఫ్రీ అంటున్న టెల్కోలు!

Last Updated : Sep 28, 2019, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details