తెలంగాణ

telangana

ETV Bharat / business

రెడ్​ మీ కే30లో అదిరే ఫీచర్లు.. భారత్​కు 5జీ మోడల్? - రెడ్ మీకే30 ఫీచర్లు

రెడ్​మీ కే సిరీస్​లో కే30 మోడల్​ను తీసుకువచ్చేందుకు షియోమీ కసరత్తులు ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన సంస్థ డెవలపర్ల సదస్సులో కే30 మోడల్​ ఫీచర్లపై పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. మరి అ కొత్త మోడల్ విశేషాలేంటో తెలుసుకోండి.

ఎంఐకే30 ఫీచర్లు

By

Published : Nov 22, 2019, 8:30 AM IST

షియోమీ నుంచి విడుదలైన మిడ్​రేంజ్​ ఫోన్ రెడ్​ మీ కే20కి కొనసాగింపుగా.. కే30 మోడల్​ను తీసుకురానున్నట్లు ఆ సంస్థ ఇదివరకే ప్రకటించింది. అయితే ఇటీవల చైనాలో జరిగిన షియోమీ డెవలపర్ల సదస్సులో కే30 మోడల్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ముఖ్యంగా.. వచ్చే నెలలో గానీ.. 2020 ప్రారంభంలో గానీ ఈ కొత్త మోడల్ విడుదలయ్యే అవకాశముందని తెలిసింది. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనేదానిపై మాత్రం పూర్తి ప్రకటన చేయలేదు షియోమీ.

అయితే.. రెడ్​మీ కే30లో రెండు సెల్ఫీ కెమెరాలు, 5జీ సపోర్ట్​ ఉండనున్నట్లు షియోమీ ఇప్పటికే ప్రకటించింది.

ఇతర ఫీచర్లు..

రెడ్ మీకే30 ఫీచర్లపై.. షియోమీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అయితే షియోమీ డెవలపర్లలో ఒకరు కొన్ని కీలక ఫీచర్లను తెలిపినట్లు కొన్ని టెక్ వార్తా సంస్థలు అంటున్నాయి. వాటి ప్రకారం కే30 మోడల్​లో ఫింగర్​ ప్రింట్​ సెన్సర్​ను సైడ్​ బార్​పైకి మార్చినట్లు తెలిసింది. ప్రస్తుతం డిస్​ప్లే ఫింగర్​ ప్రింట్ సెన్సర్ ట్రెండ్​ నడుస్తున్న నేపథ్యంలో.. షియోమీ ఈ కొత్త పద్ధతిని తీసుకురానున్నట్లు సమాచారం.

భారత్​కు కే30 వస్తుందా..

చైనాలో వచ్చే నెలలో గానీ.. 2020 తొలి నాళ్లలో విడుదలవనున్న రెడ్​ మీకే 30 మోడల్​ భారత్​కు ఎప్పుడొస్తుందనే సందిగ్ధం నెలకొంది. ఈ కొత్త మోడల్​ 5జీ సపోర్ట్​తో పని చేయనుందని ఇప్పటికే తెలిసింది.

అయితే భారత్​లో ఇప్పటి వరకు 5జీ టెక్నాలజీ లేదు. ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందనేది స్పష్టం కాలేదు. టెలికాం సంస్థలూ 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్​మీ కే30 విడుదలవుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే కొన్ని టెక్ వార్తా సంస్థలు మాత్రం 5జీ రహిత కే30 మోడల్​ను 2020 తొలి నాళ్లలోనే విడుదల చేసే అవకాశముందని అంటున్నాయి.

ఇదీ చూడండి:పార్లమెంటును తాకనున్న బ్యాంకుల విలీన వ్యతిరేక సెగ

ABOUT THE AUTHOR

...view details