తెలంగాణ

telangana

ETV Bharat / business

64 ఎమ్​పీ సూపర్​ కెమెరాతో షామీ ఫోన్​ - ఎమ్​ఐ

చైనా దిగ్గజ మొబైల్​ తయారీ సంస్థ షామీ మరో స్మార్ట్​ ఫోన్​తో మార్కెట్​ తలుపు తట్టనుంది. ఇప్పటికే ఎమ్​ఐ మిక్స్​ 3 5జీతో మార్కెట్​ను కుదిపేసిన షామీ... ఇప్పుడు అదే సిరీస్​లో ఎమ్​ఐ మిక్స్​ 4 ఫోన్​ తీసుకురానుంది. 64 ఎమ్​పీ అరుదైన కెమెరా ఇందులో ప్రధాన ఫీచర్​.

64 ఎమ్​పీ సూపర్​ కెమెరాతో షామీ ఫోన్​

By

Published : Jul 7, 2019, 1:04 PM IST

అందుబాటు ధరల్లో అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ ఫోన్లు తయారు చేసే చైనా దిగ్గజ సంస్థ షామీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 64 ఎమ్​పీ అరుదైన కెమెరా ఈ ఫోన్​కే హైలైట్​ అని చెప్పారు షామీ ప్రొడక్ట్​ డైరక్టర్​ వాంగ్ టెంగ్​.

64 ఎమ్​పీ సామ్​సంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్​ కన్నా ఈ ఫోన్​ కెమెరా అద్భుతంగా ఉంటుందన్నారు వాంగ్.

ఫీచర్లు...

  1. అమోలెడ్ 2కే హెచ్​డీఆర్​ 10+ తాకే తెర
  2. డస్ట్​, వాటర్​ రెసిస్టెంట్​ సామర్థ్యం.
  3. 64 మెగా పిక్సల్​ కలిగిన అరుదైన కెమెరా సెన్సార్

ABOUT THE AUTHOR

...view details