తెలంగాణ

telangana

ETV Bharat / business

విప్రో లాభం 38% వృద్ధి- బైబ్యాక్​కు బోర్డు ఓకే

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ. 2,493.9 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ లాభం 38 శాతం అధికం.

విప్రో లాభం 38% వృద్ధి

By

Published : Apr 16, 2019, 6:29 PM IST

ఐటీ దిగ్గజం 'విప్రో' మార్చి 31తో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ. 2,493.9 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన లాభం రూ. 1,800.8 కోట్లు.

గడచిన ఆర్థిక సంవత్సరం సంస్థ మొత్తం ఆదాయం రూ. 15,006.3 కోట్లుగా ఉండగా... అంతక్రితం ఆర్థిక సంవత్సరం రూ. 13,768.6 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.

బై బ్యాక్​కు బోర్డు ఆమోదం

సంస్థ లాభాలు సానుకూలంగా ఉన్నందున రూ. 10,500 కోట్లతో దాదాపు 32.3 కోట్ల షేర్ల బైబ్యాక్​కు సిద్ధమైంది విప్రో. ఇందుకు సంస్థ బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఒక్కో షేర్​కు రూ. 325 చొప్పున బైబ్యాక్ చేయనున్నట్లు విప్రో పేర్కొంది.

డాటా చౌర్యం

కొందరు ఉద్యోగులకు చెందిన ఖాతాలు ఫిషింగ్​కు గురైనట్లు విప్రో ప్రకటించింది. కంపెనీలో పలు అనుమానిత కార్యకలాపాలు జరిగినట్లు భావిస్తన్నామని... వెంటనే విచారణకు అదేశించినట్లు ఐటీ దిగ్గజం పేర్కొంది. ఈ ప్రభావంతో స్టాక్​ మార్కెట్లో విప్రో షేర్లు కుప్పకూలాయి. సెన్సెక్స్​లో సంస్థ షేరు 2.5 శాతం నష్టపోయి... రూ. 278.10 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో 2.12 శాతం నష్టంతో రూ. 281.60 వద్ద ముగిసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details