తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ ఫోన్లలో డిసెంబర్​ 31 తర్వాత వాట్సాప్​ బంద్​ - నిలిచిపోనున్న వాట్సాప్​ సేవలు

తమ వినియోగదారులకు షాకిచ్చింది వాట్సాప్​. వచ్చే ఏడాది నుంచి కొన్ని ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ ఫోన్లకు సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. విండోస్​ ఫోన్లకు మాత్రం పూర్తిగా సేవలు విరమించుకోనున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. మరి ఏఏ మోడళ్లకు వాట్సాప్​ సేవలు నిలిచిపోనున్నాయో తెలుసుకోండి ఇప్పుడే.

WHATSAPP
వాట్సాప్

By

Published : Dec 14, 2019, 7:37 PM IST

ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్లతో ఆకట్టుకునే సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్.. తాజాగా వినియోగదారులకు షాకిచ్చింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్​తో పని చేసే కొన్ని స్మార్ట్​ఫోన్లకు సేవలు నిలిపేయనున్నట్లు తెలిపింది. ఏఏ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి అనే సమాచారం మీ కోసం.

అండ్రాయిడ్​ ఫోన్లు..

వెర్షన్​ 2.3.7 కన్నా తక్కువ ఓఎస్​తో పనిచేస్తున్న అన్ని అండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్​ సేవలు 2020 ఫిబ్రవరి 1 నుంచి ముగియనున్నాయి. ఈ ఓఎస్​​ ఫోన్లు ఉన్న వినియోగదారులు వాట్సాప్​ను ఉపయోగించాలంటే కొత్త మోడళ్లకు అప్​గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.

యాపిల్​ ఫోన్లు..

ఐఓఎస్​ 8, అంతకన్నా తక్కువ ఓఎస్​ వెర్షన్లతో పని చేసే అన్ని యాపిల్​ ఫోన్లలోనూ వాట్సాప్​ సేవలు నిలిచిపోనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇది వర్తిస్తుంది.

విండోస్​ ఫోన్లు..

విండోస్​ ఫోన్లకు 2020 జనవరి 1 నుంచి పూర్తిగా సేవలు ఆగిపోనున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రస్తుతం విండోస్​ యూజర్లు వచ్చే ఏడాది నుంచి వాట్సాప్​ వాడాలంటే ఆండ్రాయిడ్​కుగానీ ఐఓఎస్​కు గానీ మారక తప్పదు.

నిర్ధరించుకోవడం ఎలా..

మీరు పాత ఫోన్లు వాడుతున్నట్లయితే.. సెట్టింగ్స్​లో వాట్సాప్​ ప్రకటించిన వెర్షన్​లలో మీ ఫోన్​ ఉందోలేదో తెలుసుకుంటే సరిపోతుంది. ఒక వేళ మీ ఫోన్​ మోడల్​​ ఆ జాబితాలో ఉంటే మీ వాట్సాప్​ డేటా మొత్తం బ్యాకప్​ చేసుకోవడం మంచిది.

ఆ మోడల్​ ఫోన్లు తక్కువే..

కొన్ని ఫోన్లలో వాట్సాప్​ సేవలు నిలిచిపోనున్నా.. పెద్దగా భయపడాల్సిన పనిలేదన్నది టెక్​ నిపుణుల మాట. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది కనీసం ప్రతి రెండేళ్లకోసారి ఫోన్​ను మారుస్తున్నందున వాటిలో పాత వెర్షన్​ ఓఎస్ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. అండ్రాయిడ్​, ఐఓఎస్​ పాత వెర్షన్​ ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని, వారు మాత్రం కొత్త మోడల్​కు అప్​గ్రేడయితే సరిపోతుందని అంటున్నారు.

విండోస్​ ఫోన్​ యూజర్లు మాత్రం తప్పని సరిగా అండ్రాయిడ్ గానీ ఐఓఎస్​కుగానీ మారక తప్పదని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:రియల్​మీ 'బడ్స్​ ఎయిర్​'​ ధరెంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details