ప్రముఖుల జీవన శైలి పట్ల మనందరికీ ఆసక్తి ఉంటుంది. వారి ఆహార్యాన్ని, అలవాట్లను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. అయితే వీరిలో చాలా మందికి కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడో, నలుగురు ఉన్నప్పుడో పలు సందర్భాల్లో వారి అలవాట్లు బయటపడతాయి. ఇందుకు ప్రముఖ సంస్థల సీఈఓలు కూడా అతీతం కాదు. ఫేస్బుక్, పెప్సికో, మైక్రోసాప్ట్, టెస్లా సహా నిన్టెన్డో సంస్థలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఇదే కోవకు వస్తారు. మరి వారి అలవాట్లు ఏంటో మీరూ చూసేయండి..
మార్క్ జుకర్బర్గ్
ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. ఏదైనా కార్యక్రమంలో ప్రసంగానికి స్టేజ్ ఎక్కే ముందు తన అండర్ ఆర్మ్స్ కి బ్లో డ్రై చేయించుకుంటారట. ఈ విచిత్రమైన అలవాటుకు కారణం ఉంది. ఆత్రుత, ఆందోళన, భయం వల్ల పట్టే చమటను ఎదుర్కోవడానికే ఇలా.
పెప్సికో మాజీ సీఈఓ
పెప్సికో సంస్థ మాజీ సీఈఓ ఇంద్రా నూయికి కూడా ఓ విచిత్రమైన అలవాటు ఉందట. సాధారణంగా భోజనం చేసే సమయంలో కొందరికి నియమాలు ఉంటాయి. తినే ముందు చేతులు శుభ్రం చేసుకోమని, ఆహారాన్ని బాగా నమలాలని నియమాలు పెట్టుకుంటారు. అయితే ఇంద్రా నూయి కుటుంబం మాత్రం అందుకు భిన్నం. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు రోజూ భోజన సమయానికి ఓ ప్రసంగాన్ని సిద్ధం చేయాలని చెప్పేవారు. అది వారికి వినిపించాలి. అందులో ఎవరి ప్రసంగం బాగుంటే వారికి ఆ తల్లిదండ్రుల ఓటు.
బిల్గేట్స్..