తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్​ 'లిబ్రా' ప్రాజెక్ట్​ నుంచి వొడాఫోన్ ఔట్​ - ఫేస్​బుక్​కు వొడాఫోన్ షాక్​

టెలికాం దిగ్గజం వొడాఫోన్.. ఫేస్​బుక్ చేపట్టిన 'లిబ్రా' క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్​ నుంచి తప్పుకుంది. ఇప్పటికే పలు బడా కంపెనీలు ఈ ప్రాజెక్ట్​ నుంచి వైదొలిగినా.. 'లిబ్రా' అసోసియేషన్​ ఏర్పడిన తర్వాత తప్పుకున్న తొలి కంపెనీ వొడాఫోన్ కావడం గమనార్హం.

LIBRA
లిబ్రా ప్రాజెక్ట్​ నుంచి వొడాఫోన్​ ఔట్​

By

Published : Jan 22, 2020, 2:57 PM IST

Updated : Feb 17, 2020, 11:52 PM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​కు.. టెలికాం సంస్థ వొడాఫోన్ షాకిచ్చింది. ఫేస్​బుక్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'లిబ్రా' క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్​ నుంచి ఇప్పటికే పేపాల్, మాస్టార్​కార్డ్, వీసా, మెర్గాడో పాగో, ఈబేలు తప్పుకోగా.. వీటి సరసన ఇప్పుడు వొడాఫోన్ చేరింది.

గత ఏడాది అక్టోబర్​లో లిబ్రా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన తొలి సంస్థ వొడాఫోన్​ కావడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్​ నుంచి వొడాఫోన్​ వైదొలిగిన విషయాన్ని లిబ్రా అసోసియేషన్​ అధికారికంగా ధ్రువీకరించింది. అసోసియేషన్​లో మార్పులు వచ్చినప్పటికీ ప్రాజెక్ట్​ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఎందుకు తప్పుకుంటున్నాయి..?

క్రిప్టో కరెన్సీపై పలు నియంత్రణ సంస్థలు యూజర్ల డేటా భద్రత విషయంపై అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తొలుత లిబ్రా ప్రాజెక్ట్​లో చేరిన కంపెనీలు వరుసగా తప్పుకుంటున్నాయి.

ఇదీ చూడండి:తాజ్​మహల్ అందాలకు జెఫ్​ బెజోస్​ ఫిదా

Last Updated : Feb 17, 2020, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details