వాహన బీమా ఉందని చిన్న చిన్న ప్రమాదాలకు క్లెయిమ్ చేసుకుంటున్నారా? క్లెయిమ్ రేటు పెరిగితే వచ్చే నష్టాలేంటో తెలుసుకోండి ఇప్పుడే.
సెటిల్మెంట్ మేలు
కొంత మంది చిన్న ప్రమాదాలకు కూడా క్లెయిమ్‌ను ఆశ్రయిస్తున్నారని, ఇది సరైంది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే చిన్న ప్రమాదాలకూ పోలీస్ కంప్లయింట్ ఇస్తే వారు జనరల్ డైరీలో నమోదు చేస్తారు. ఫలితంగా మీ బండిని ప్రమాదాల బారిన పడ్డ వాహనంగా గుర్తిస్తారు.
దీన్ని నివారించేందుకు వాహనం ప్రమాదానికి గురైనప్పుడు దాన్ని మరమ్మతుకు ఎంత ఖర్చవుతుందనే అంచనా వేయించుకోవాలి. నష్టభారం అధికంగా ఉందనుకుంటేనే క్లెయిమ్‌ను ఆశ్రయించాలన్నది నిపుణుల అభిప్రాయం. చిన్న ప్రమాదమైతే సెటిల్మెంట్ పద్ధతిని అనుసరిస్తే మంచిదంటున్నారు.
నో క్లెయిమ్ బోనస్ రాకపోవచ్చు
చిన్న ప్రమాదాలకు బీమా క్లెయిమ్ చేసుకోవడం ద్వారా నో క్లెయిమ్ బోనస్ రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.