సహజ వనరుల మైనింగ్ దిగ్గజం వేదాంత 2019-20 చివరి త్రైమాసికంలో రూ.12,521 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2018-19 ఇదే సమయంలో సంస్థ లాభం రూ.2,615 కోట్లుగా ఉంది. సంస్థ ఏకీకృత ఆదాయం 25,096 కోట్ల నుంచి రూ.20,382 కోట్లకు పడిపోయింది.
వేదాంత క్యూ4 నష్టం రూ.12,521 కోట్లు
గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేదాంత భారీ నష్టాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి మధ్య మూడు నెలల్లో రూ.12,521 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.
వేదాంత భారీ నష్టం
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్.. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రెమాసికంపై తీవ్ర ప్రభావం చూపినట్లు వేదాంత పేర్కొంది. 2020 మార్చి 31 నాటికి సంస్థకు రూ.59,187 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:అమూల్ ట్విట్టర్ పేజీ బ్లాక్.. కారణమేంటి?