తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ ఐఫోన్​ 'లొకేషన్​ డేటా' భద్రమేనా? - సీఈఓ

ఐఫోన్​ సహా ఏదైనా ఐఓఎస్​ డివైజ్​లో ట్విట్టర్​ వాడుతున్నారా...? అయితే మీ లొకేషన్​ డేటా లీకయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టరే ప్రకటించింది. తమ ప్రమేయం లేకుండానే కొందరు ఐఓఎస్​ యూజర్ల డేటాను సేకరించడం, ఓ భాగస్వామ్య సంస్థకు పంచుకోవడం జరుగుతోందని తెలిపింది.

మీ ఐఫోన్​ 'లొకేషన్​ డేటా' భద్రమేనా?

By

Published : May 14, 2019, 3:20 PM IST

యాపిల్​ డివైజ్​ల యూజర్ల సమ్మతి లేకపోయినా... కొందరి లొకేషన్​ డేటా ఓ భాగస్వామ్య సంస్థకు వెళుతోందని గుర్తించింది ట్విట్టర్​. "అనుకోకుండా కొన్ని సందర్భాల్లో ఐఓఎస్​ యూజర్ల డేటా సేకరించి, ఓ భాగస్వామ్య సంస్థతో పంచుకుంటున్నాం" అని ట్విట్టర్​ తెలిపింది.

ఆ భాగస్వామ్య సంస్థ వద్ద యూజర్ల లొకేషన్​ వివరాలు కొంత సమయమే ఉంటున్నాయని, తరువాత డిలీట్​ అవుతున్నాయని తెలిపింది ట్విట్టర్​.

వారికే సమస్య

ఐఫోన్​ సహా ఇతర ఐఓఎస్​ డివైజ్​లలో ఒకటి కంటే ఎక్కువ ట్విట్టర్​ ఖాతాలు వాడుతున్న వారికే ప్రధానంగా ఈ సమస్య ఎదురవుతోంది. ప్రిసైస్​ లొకేషన్​ సదుపాయాన్ని ఒక ఖాతాలో ఆన్​ చేస్తే.. మరో ఖాతా వాడిన సమయంలో ఆ సదుపాయాన్ని ఆన్​ చేయకున్నా లొకేషన్​ అనుకోకుండా సేకరిస్తున్నామని తెలిపింది ట్విట్టర్​.

ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించామని, పునరావృతం కాకుండా కృషి చేస్తున్నామని తెలిపింది ట్విట్టర్​. లొకేషన్​ డేటా సమస్యకు గురైన యూజర్లకు బగ్​ను పరిష్కరించిన సమాచారాన్ని పంపామని పేర్కొంది. అయితే ఆ లొకేషన్​ డేటా లీకేజీ ఎప్పుడు, ఎంత కాలం జరిగిందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

ఇదీ చూడండి:భాజపా సర్కార్ మునుగుతున్న నావ: మాయ

ABOUT THE AUTHOR

...view details