తెలంగాణ

telangana

ETV Bharat / business

టీసీఎస్​ రికార్డ్... రూ.13 లక్షల కోట్లపైకి ఎం-క్యాప్​

టాటా గ్రూప్​నకు చెందిన ఐటీ సేవల విభాగం టీసీఎస్​ షేర్లు మంగళవారం భారీగా లాభాలను నమోదు చేశాయి. దీనితో కంపెనీ షేరు విలువ జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాపిటల్​ సరికొత్త మైలురాయిని దాటింది.

TCS new record
టీసీఎస్​ కొత్త రికార్డు

By

Published : Aug 17, 2021, 5:58 PM IST

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) కొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ మార్కెట్ క్యాపిటల్​ (ఎం-క్యాప్​) తొలిసారి రూ.13 లక్షల కోట్ల మార్క్​ను దాటింది. దీనితో దేశంలో రెండో అతిపెద్ద లిస్టెడ్​ కంపెనీగా నిలిచింది టీసీఎస్​.

టీసీఎస్​ ఎం-క్యాప్​ ప్రస్తుతం (బీఎస్​ఈ డేటా ప్రకారం) రూ.13,14,051.01 కోట్లుగా ఉంది. బీఎస్​ఈలో మంగళవారం సెషన్​లో టీసీఎస్​ షేర్లు 2.32 శాతం లాభపడ్డాయి. ఫలితంగా ఒక షేరు విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.3,552.40 వద్దకు చేరింది. దీనితో కంపెనీ ఎం-క్యాప్ ఈ రికార్డు స్థాయికి దాటింది.

మంగళవారం సెషన్​లో టీసీఎస్​ సహా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్ వంటి ఇతర ఐటీ సంస్థలు కూడా భారీగా లాభాలను గడించాయి.

ఎం-క్యాప్​ పరంగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్​ (మంగళవారం నాటి డేటా ప్రకారం) రూ.13,71,823.79 కోట్లు.

ఇదీ చదవండి:రికార్డుల పరంపర- 55,800కు చేరువలో సెన్సెక్స్

ABOUT THE AUTHOR

...view details