తెలంగాణ

telangana

ETV Bharat / business

టీసీఎస్ తొలి త్రైమాసిక నికర లాభం రూ.8,131కోట్లు - TCS Q1 net profit

తొలి త్రైమాసికంలో రూ.8,131కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్​. ఈ ఏడాది ఎప్రిల్​-జూన్​ ఫలితాలను వెల్లడించింది. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 11.4శాతం పెరిగి రూ.38,172 కోట్లకు చేరింది.

టీసీఎస్ తొలి త్రైమాసిక నికర లాభం రూ.8,131కోట్లు

By

Published : Jul 9, 2019, 9:48 PM IST

దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్​ ఈ ఏడాది తొలిత్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. ఈ త్రైమాసికానికి రూ.8,131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభంలో 10.8శాతం వృద్ధి నమోదయింది. ఆదాయం 11.4శాతం పెరిగి రూ.38,172కు చేరింది.

గతేడాది ఏప్రిల్​-జూన్​ త్రైమాసికానికి 32.2శాతంగా ఉన్న డిజిటల్​ రెవిన్యూ ఈ ఏడాది 42.1శాాతానికి పెరిగింది. గత ఐదేళ్లలోనే అత్యధికంగా ఈ ఒక్క ఏడాదిలోనే 12,356 మంది నూతన ఉద్యోగులను చేర్చుకుంది ముంబయికి చెందిన టెక్​ దిగ్గజ సంస్థ. ప్రస్తుతం టీసీఎస్​లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,36,641కి చేరింది.

టీసీఎస్​ ఒక్కో షేరు రూ.21.67 లాభం ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 13శాతం వృద్ధి చెందింది. 2018-19 టీసీఎస్ తొలిత్రైమాసిక నికర లాభం రూ.7,340కోట్లు.
2018-19 టీసీస్​ తొలిత్రైమాసిక ఆదాయం రూ.34,261కోట్లు.

ఇదీ చూడండి: ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం ధర

ABOUT THE AUTHOR

...view details