తెలంగాణ

telangana

ETV Bharat / business

యూఎస్-చైనా వాణిజ్య చర్చలతో తిరిగి లాభాల్లోకి.. - అమెరికా చైనా

అంతర్జాతీయ సానుకూలతల నడుమ స్టాక్​ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 177.51 పాయింట్లు లాభపడగా... నిఫ్టీ 67.95 పాయింట్లు పుంజుకుంది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Apr 5, 2019, 5:01 PM IST

రెండు రోజుల నష్టాల తర్వాత స్టాక్​ మార్కెట్లు వారాంతంలోతిరిగిలాభాలను నమోదు చేశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 177.51 పాయింట్లు లాభపడి 38,862.23 పాయింట్ల (0.46 శాతం) వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 67.95 పాయింట్లు పుంజుకుని 11,665.95 పాయింట్ల (0.59 శాతం) వద్ద సెషన్​ ముగించింది.

ఇదీ కారణం

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరదించే విధంగా ఇరు దేశాలు చర్చలు ముమ్మరం చేసాయి. ఈ చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఓ ప్రకటన చేశారు. ఈ సంకేతం నేటి మార్కెట్లకు కలిసొచ్చింది.

ఫలితంగా ఐటీ, లోహ రంగాల్లో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

ఇంట్రాడే సాగిందిలా..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 38,958.60 38,701.04
నిఫ్టీ 11,689.65 11,609.50

లాభానష్టాల్లోనివివే...

సెన్సెక్స్​లో నేడు టాటా స్టీల్​ అత్యధికంగా 3.36 శాతం లాభాన్ని నమోదు చేసింది.
ఈ వరుసలో వేదాంతా 2.38 శాతం, బజాజ్​ ఫినాన్స్​2.20 శాతం, టీసీఎస్​ 1.84 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.68 శాతం, ఇన్ఫోసిస్​ 1.52 శాతం లాభపడ్డాయి.

ఎస్​బీఐ 1.46 శాతం, పవర్​గ్రిడ్ 1.36 శాతం, హీరో మోటార్స్​ 0.78 శాతం, ఎన్​టీపీసీ 0.70 శాతం, సన్​ఫార్మా 0.67 శాతం, హెచ్​యూఎల్​ 0.50 శాతం మేర నష్టాలను నమోదు చేశాయి.

30 షేర్ల సెన్సెక్స్​ ఇండెక్స్​లో 16 షేర్లు లాభాలను నమోదు చేయగా... 14 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 34 షేర్లు లాభాలను, 16 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details