తెలంగాణ

telangana

ETV Bharat / business

మదుపరులు అప్రమత్తం- ఒడుదొడుకుల్లో సూచీలు - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. భారీ లాభాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 85 పాయింట్లు బలపడింది. నిఫ్టీ  24 పాయింట్లు వృద్ధి చెందింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : May 21, 2019, 9:54 AM IST

ప్రారంభ లాభాలతో నేడు జీవనకాల గరిష్ఠాలను తాకాయి సూచీలు. నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 85 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 39,437 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11,853 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

లాభానష్టాల్లో....

హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్​, సన్​ఫార్మా, రిలయన్స్, కోల్ ఇండియా, బజాజ్​ ఆటో షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టాటా మోటార్స్, ఎస్​ బ్యాంకు, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details