స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 135.16 పాయింట్లు లాభపడి... 39,122.65 పాయింట్లతో జీవనకాల గరిష్ఠం వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 26.50 పాయింట్ల స్వల్ప లాభంతో 11,817.20 వద్ద రికార్డుస్థాయి గరిష్ఠాన్ని తాకింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితంపై అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.