తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్ ప్రకటనతో డీలా పడిన దేశీయ సూచీలు

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 224 పాయింట్ల నష్టంతో 39,900 మార్కును కోల్పోయింది. నిఫ్టీ 67 పాయింట్లు తగ్గింది. ఐటీ, బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

నష్టాల్లో సూచీలు

By

Published : Jun 12, 2019, 9:48 AM IST

Updated : Jun 12, 2019, 11:11 AM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు, దేశీయంగా కీలక గణాంకాలపై ప్రతికూల అంచనాల నడుమ స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 224 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం 39,726 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 11,898 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

విశ్లేషణ

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం అంచనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రతికూలంగా స్పందించారు. చైనాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా లేమని ఇటీవల ప్రకటించారు. ఈ ఒప్పందానికి చైనానే అడ్డుపడుతోందంటూ ఆరోపించారాయన. ఈ ప్రకటనతో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతుందన్న అంచనాలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

వీటితో పాటు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను నేడు వెల్లడించనుంది కేంద్ర గణాంకాల కార్యాలయం. వీటి ప్రభావం కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.

లాభనష్టాల్లోనివివే..

టాటా స్టీల్​, వేదాంత, సన్ ఫార్మా, ఓఎన్​జీసీ, ఏషియన్​ పెయింట్స్​, రిలయన్స్​ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఎస్ బ్యాంకు, బజాజ్ ఆటో, హెచ్​సీఎల్​టెక్​, టీసీఎస్​, మారుతీ, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడిచమురు

నేటి సెషన్​ ప్రారంభంలో రూపాయి 7 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.37 వద్ద కొనసాగుతోంది.

ముడిచమురు ధరల సూచీ-బ్రెంట్​ 1.36 శాతం తగ్గింది. బ్యారెల్ ముడిచమురు ధర 61.44 డాలర్లుగా ఉంది.

ఇతర ప్రధాన మార్కెట్లు ఇలా...

ఆసియాలోని ఇతర అన్ని మార్కెట్లపై అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. చైనా, జపాన్​, దక్షిణ కొరియా సూచీలు నేటి సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి.

ఇదీ చూడండి: ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ఛార్జీల్లేవ్.. జులై 1 నుంచి అమలు​

Last Updated : Jun 12, 2019, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details