తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో డీలా - నష్టాల్లో సూచీలు

విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 175 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 50 పాయింట్లు తగ్గి.. 11,900 పాయింంట్ల మార్కును కోల్పోయింది.

నష్టాల్లో సూచీలు

By

Published : Jun 13, 2019, 9:52 AM IST

Updated : Jun 13, 2019, 10:43 AM IST

అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 175 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం 39,582 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 11,852 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

ఎందుకు నష్టాలు?

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు నేటి మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా లేవన్న వార్తల నేపథ్యంలో విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపుతున్నారు.

లాభనష్టాల్లోనివివే..

టీసీఎస్​, యాక్సిస్​ బ్యాంకు, ఎల్​&టీ, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఎస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్​ బ్యాంకు, వేదాంత, ఇన్ఫోసిస్, టాటా స్టీల్​, టాటా మోటార్స్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా తగ్గింది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.37 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.08 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్​ ముడి చమురు ధర 59.92 డాలర్లుగా ఉంది.

ఇతర మార్కెట్లు ఇలా....

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై సూచీ లాభాలతో ప్రారంభమవ్వగా.. జపాన్​, దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి: 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు

Last Updated : Jun 13, 2019, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details