తెలంగాణ

telangana

ETV Bharat / business

రెపో ప్రకటనకు ముందు మదుపరుల అప్రమత్తత - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 47 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 6 పాయింట్లు వృద్ధిచెందింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Aug 7, 2019, 10:04 AM IST

స్టాక్​ మార్కెట్లు నేడు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఆర్బీఐ రెపో ప్రకటనకు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండగా స్వల్ప లాభాలకు పరిమితమైంది.
ఆర్​బీఐ మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం నేటితో ముగియనుంది. మధ్యాహ్నం రెపో రేటు మార్పుపై నిర్ణయం వెలువడనుంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 47 పాయింట్లు పుంజుకుంది. ప్రస్తుతం 37,024 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 10,954 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

ఎస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్​ బ్యాంకు, హీరో మోటార్స్, ఇన్ఫోసిస్​, సన్​ఫార్మా, టెక్​ మహీంద్రా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

టాటా స్టీల్​, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంకు, కోటక్​ బ్యాంకు, వేదాంత, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: సులభంగా ఐటీఆర్​ దాఖలు చేయండిలా..

ABOUT THE AUTHOR

...view details