తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా సుంకాల సెగ- మార్కెట్లకు నష్టాల వాత - సెన్సెక్స్​

స్టాక్​ మార్కెట్లు సెషన్ ప్రారంభంలోనే భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్​ 260 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 80 పాయింట్లు క్షీణించింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : May 8, 2019, 9:56 AM IST

Updated : May 8, 2019, 10:57 AM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలతో స్టాక్​ మార్కెట్లలో నేడూ నష్టాల మోత కొనసాగుతోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 260 పాయింట్లు కోల్పోయి.. 38,015 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 80 పాయింట్ల నష్టానికి 11,415 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు

అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం పరిష్కారానికి ప్రయత్నాలు ఇంకా మొదలు కాలేదు. ఈ కారణంగా యుద్ధ భయాలు మదుపర్లను బెంబేలెత్తిస్తున్నాయని అంటున్నారు నిపుణులు.

బ్యాంకింగ్​, ఇతర వినియోగ రంగ సంస్థల ఫలితాలపై అంచనాలు తప్పడం మార్కెట్ల నష్టాలకు మరో కారణం.

లాభానష్టాల్లోనివే

సెన్సెక్స్​లో పవర్​ గ్రిడ్​, హెచ్​సీఎల్​టెక్​, ఐసీఐసీఐ బ్యాంకు, కోల్​ ఇండియా, ఇండస్​ఇండ్​బ్యాంకు, సన్​ ఫార్మా షేర్లు​ ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

వేదాంత, హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్​, బజాజ్​ ఆటో, ఓఎన్​జీసీ, బజాజ్​ ఫినాన్స్​, ఎస్​బీఐ షేర్లు సహా ఆటోమొబైల్​, ఆర్థిక రంగ షేర్లు అధికంగా నష్టాల్లో సాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

నేడు ప్రారంభ ట్రేడింగ్​లో రూపాయి 20 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్​తో రూపాయి మారకం విలువ 69.62 వద్ద ట్రేడవుతోంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.44 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 70.19 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇతర మార్కెట్లు ఇలా

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు షాంఘై సూచీ, హాంకాంగ్​ సూచీ-హంగ్​ సెంగ్​, జపాన్​ సూచీ-నిక్కీ, దక్షిణ కొరియా సూచీ-కోస్పీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా దాదాపు అన్ని ప్రధాన మార్కెట్లపై అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు అలుముకున్నాయి.

Last Updated : May 8, 2019, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details