తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతం ఆశాజనకం- టాటా స్టీల్​ జోరు - నిఫ్టీ

స్టాక్​ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్  దాదాపు 70 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Apr 26, 2019, 9:48 AM IST

Updated : Apr 26, 2019, 10:52 AM IST

వారాంతంలో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

బాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 70 పాయింట్లు బలపడి... 38,795 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,675 వద్ద ట్రేడవుతోంది.

ఇవీ కారణాలు

విదేశీ పెట్టుబడుల ప్రవాహం మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచింది. బ్యాంకింగ్​ రంగాల్లో జరుగుతున్న కొనుగోళ్లు నేటి లాభాలకు ప్రధాన కారణం.

లాభానష్టాల్లోనివే

సెన్సెక్స్​లో టాటా స్టీల్​ అత్యధికంగా 5.11 శాతం లాభాంతో ట్రేడవుతోంది.

ఇటీవల ప్రకటించిన వార్షిక ఫలితాల్లో ఏకంగా రూ.1,59,089.57 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించింది టాటా స్టీల్​. ఈ కారణంగా సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపుతున్నారు.

యాక్సిస్​ బ్యాంకు, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్​, పవర్​ గ్రిడ్​, ఎల్​ అండ్​టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టాటా మోటార్స్​, మారుతి, ఇండస్​ ఇండ్​, కోటక్​ బ్యాంకు, హీరో మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి విలువ 24 పైసలు పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ 70.13 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.24 శాతం తగ్గి... బ్యారెల్​కు 74.17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గత సెషన్​లో బ్యారెల్ ముడి చమురు ధర 75 డాలర్లు దాటి ఆరు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది.

Last Updated : Apr 26, 2019, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details