స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 36.13 పాయింట్ల లాభంతో 38,643.14 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12.40 పాయింట్ల స్వల్ప లాభంతో 11,596.70 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
వార్షిక ఫలితాలపై ఆశలతో స్వల్ప లాభాలు - సెన్సెక్స్
వారంలో చివరి సెషన్‌ను స్వల్ప లాభాలతో ప్రారంభించాయి స్టాక్ మార్కెట్లు. సెనెక్స్ 36.13 పాయింట్లు పుంజుకోగా... నిఫ్టీ12.40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.
స్టాక్ మార్కెట్లు
దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు గత ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలను నేడు ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలపై సానుకూల అంచనాలతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతిక, ఔషధ, వాహన రంగాలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్‌లో టీసీఎస్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ డీవీఆర్, ఏషియన్ పెయింట్స్, ఎల్ ఆండ్ టీ, ఎం అండ్ ఎం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.