కంపెనీల వార్షిక ఫలితాలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారంలో రెండో సెషన్లోనూ ఒడుదొడుకుల నడుమ ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెనెక్స్ స్వల్ప నష్టాల్లో ప్రారంభమై ఓ దశలో 12 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం నష్టాల నుంచి తేరుకుని 103.64 పాయింట్ల వృద్ధితో 38,804.17 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. కాసేపటికే 18.25 పాయింట్లు బలపడి.. ప్రస్తుతం 11,622.75 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
ప్రధానంగా ఆర్థిక రంగాల్లో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు మదుపరులు.
సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, వేదాంత, టాటా మోటర్స్, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, కొటక్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.