తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ ప్రతికూలతలు- నష్టాల్లో సూచీలు - సెన్సెక్స్​

విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలతో స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 75 పాయింట్లు తగ్గింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Apr 30, 2019, 10:11 AM IST

Updated : Apr 30, 2019, 11:09 AM IST

స్టాక్​ మార్కెట్లు నేడు భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్లు క్షీణించి 38,830 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 11,680 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడ్డ ప్రతికూల సంకేతాలు నేటి ట్రేడింగ్​పై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. అమెరికా ఫెడ్​ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయం బుధవారం వెలువడనుంది. ఈ నిర్ణయంపై అంచనాలు కూడా నేటి మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

నష్టాలు పరిమితమే?

రూపాయి సానుకూలత, చమురు ధరల తగ్గుదల కారణంగా నష్టాలు పరిమితంగానే ఉండొచ్చని మార్కెట్​​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

లాభానష్టాల్లోనివే

సెన్సెక్స్​లో హెచ్​సీఎల్​టెక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఏషియన్​ పెయింట్స్​, ఇన్ఫోసిస్​, యాక్సిస్​ బ్యాంకు షేర్లు ప్రధానంగా లాభాల్లో సాగుతున్నాయి.

యస్ బ్యాంకు షేర్లు అత్యధికంగా 24.81 శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. ఆస్ట్రేలియా బ్రోకరేజి సంస్థ మెక్వారీ యస్​ బ్యాంకు షేరు రేటింగ్​ను ఇటీవల రెండు ర్యాంకులు తగ్గించింది. ఈ కారణంగా యస్​ బ్యాంకు షేర్లు భారీగా పతనమయ్యాయి.

ఇండస్​ఇండ్ బ్యాంకు, సన్​ఫార్మా, హీరో మోటోకార్ప్, మారుతి, వేదాంత షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి 32 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో రూపాయి మారకం విలువ 69.70 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.22శాతం కీణించింది. బ్యారెల్​ ముడి చమురు ధర 71.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇతరమార్కెట్లు ఇలా

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు జపాన్​ సూచీ నిక్కీ, దక్షిణ కొరియా సూచీ కోస్పి, షాంఘై సూచీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి.

Last Updated : Apr 30, 2019, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details