తెలంగాణ

telangana

ETV Bharat / business

మిశ్రమ పవనాలు- మందకొడిగా మార్కెట్లు - నిఫ్టీ

స్టాక్​ మార్కెట్లు నేడు మందకొడిగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 60 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు బలపడింది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : May 16, 2019, 9:56 AM IST

అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు సహా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు నేడు మందకొడిగా ప్రారంభమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లు బలపడి.. 37,185 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంతో 11,170 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

లాభానష్టాల్లోనివే

టాటా మోటార్స్, పవర్ గ్రిడ్​, బజాజ్​ ఫినాన్స్, ఇన్ఫోసిస్​, వేదాంత, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

కోటక్ మహీంద్రా బ్యాంకు, కోల్​ ఇండియా, సన్​ఫార్మా, ఎం&ఎం, ఎల్​&టీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

సెషన్ ప్రారంభంలో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ 70.31 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.56 శాతం పెరిగింది. బ్యారెల్​ ముడి చమరు ధర 72.17 డాలర్లకు చేరింది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details