తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐఎంఎఫ్​ అంచనాలతో బేరుమన్న సూచీలు - సెన్సెక్స్​

అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రపంచ వృద్ధి రేట్లను తగ్గించడం కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఈ పరిణామాలకు ప్రభావితమైన దేశీయ సూచీలు భారీగా నష్టాన్ని మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్​ 353 పాయింట్లు... నిఫ్టీ 87.65 పాయింట్లు పతనమయ్యాయి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Apr 10, 2019, 4:34 PM IST

ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు... మిడ్ సెషన్​ తర్వాత ఓ మోస్తరు నష్టాల్లో సాగాయి. ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలతో భారీగా పతనమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 353.87 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి 38,585.35 పాయింట్లకు చేరింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 87.65 పాయింట్ల నష్టంతో... 11,584.30 పాయింట్ల వద్ద సెషన్​ ముగించింది.

ఇదీ కారణం

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు దాదాపు అన్నీ.. నష్టాలను నమోదు చేశాయి.

ఈ ప్రభావం దేశీయ మదుపరుల సెంటిమెంటును దెబ్బతీసింది. లాభాల స్వీకరణకు వారు మొగ్గుచూపారు. అయితే భారత్​ వృద్ధి కొనసాగుతుందని ఐఎంఎఫ్​ అంచనా వేసింది.

ఐరోపా దిగుమతులపై 11 బిలియన్​ డాలర్ల సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దెబ్బతో ఐరోపా మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్​ 38,950.45 38,542.28
నిఫ్టీ 11,680.05 11,571.75

లాభనష్టాల లెక్కలివి

లాభపడిన షేర్లు నష్టపోయిన షేర్లు
టాటా మోటార్స్​ - 4.68 శాతం భారతీ ఎయిర్​టెల్ - 3.28 శాతం
హెచ్​యూఎల్​ - 0.78 శాతం ఏషియన్​ పెయింట్స్​ - 2.15 శాతం
కోటక్​ బ్యాంకు - 0.61 శాతం టీసీఎస్​ - 2.12 శాతం
కోల్​ ఇండియా - 0.55 శాతం హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు - 2.07 శాతం
సన్ ​ఫార్మా - 0.36 శాతం హెచ్​డీఎఫ్​సీ - 1.96 శాతం

30 షేర్ల ఇండెక్స్​లో 8 షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించగా... 22 షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 21 షేర్లు లాభాలను, 29 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details