తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటుపోట్లతో మొదలై.. అనూహ్య లాభాలు - ఎస్ఎస్ఈ

ఉదయం ఆటుపోట్ల నడుమ ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు మిడ్​ సెషన్ నుంచి అనూహ్యంగా భారీ లాభాల్లోకి మళ్లాయి. సెషన్​ ముగిసే సమయానికి సెన్సెక్స్ 238.69 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 67.45 పాయింట్లు పుంజుకుంది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Apr 9, 2019, 5:05 PM IST

ఆర్థిక రంగంలో అమ్మకాల ఒత్తిడితో ఉదయం ఆటుపోట్ల నడుమ ప్రారంభమయ్యాయి స్టాక్​ మార్కెట్లు. తిరిగి అదే రంగంలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాట పట్టాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 238.69 పాయింట్లు బలపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి 38,939.22 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 67.45 పాయింట్ల లాభంతో... 11,671.95 వద్ద సెషన్​ ముగించింది.

ఇదీ కారణం

ఆర్థిక, ఐటీ, వాహన, ఫార్మా రంగాల సానుకూలత నేటి లాభాలకు ప్రధాన కారణం.

ఇంట్రాడే సాగిందిలా..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 38,978.99 38,598.72
నిఫ్టీ 11,683.90 11,569.70

లాభనష్టాల లెక్కలివి...

లాభపడిన షేర్లు నష్టపోయిన షేర్లు
యస్​ బ్యాంకు - 4.08 శాతం ఏషియన్​ పెయింట్స్ ​- 3.54 శాతం
టాటా మోటర్స్​ - 2.67 శాతం ఇన్ఫోసిస్​​ - 0.95 శాతం
ఐసీఐసీఐ బ్యాంకు - 2.52 శాతం భారతీ ఎయిర్​టెల్ - 0.76 శాతం
బజాజ్​ ఆటో - 2.19 శాతం బజాజ్​ ఫినాన్స్​ - 0.48 శాతం
కోల్​ ఇండియా - 2.12 శాతం ఓఎన్​జీసీ - 0.35 శాతం

30 షేర్ల ఇండెక్స్​లో 25 షేర్లు లాభాలను ఆర్జించాయి. 5 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 37 షేర్లు లాభాలను, 13 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details