సెషన్ ప్రారంభం నుంచే ఒడుదొడుకుల నడుమ ట్రేడయిన స్టాక్ మార్కెట్లు... చివరకు నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 161.70 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి 38,700.53 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 61.45 పాయింట్ల నష్టంతో సెషన్ ముగిసే సమయానికి 11,604.50 వద్ద స్థిరపడింది.
ఇదీ కారణం
ఈ వారంలో దేశంలోని ప్రధాన కంపెనీల వార్షిక ఫలితాలు సహా... రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. ఈ గణాంకాలపై అంచనాలతో మదుపరులు అమ్మకాలవైపు మొగ్గు చూపారు.
ముఖ్యంగా ఆర్థిక, చమురు, లోహ రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురవడమే నేటి నష్టాలకు కారణం.
ఇంట్రాడే సాగిందిలా..
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 39,041.25 | 38,520.96 |
నిఫ్టీ | 11,710.30 | 11,549.10 |
లాభనష్టాల లెక్కలివి
లాభపడిన షేర్లు | నష్టపోయిన షేర్లు |
ఇన్ఫోసిస్ - 1.44 శాతం | యస్ బ్యాంకు - 2.66 శాతం |
ఎం అండ్ ఎం - 1.07 శాతం | బజాజ్ ఫినాన్స్ - 2.57 శాతం |
టీసీఎస్ - 0.89 శాతం | వేదాంత - 2.51 శాతం |
పవర్ గ్రిడ్ - 0.74 శాతం | టాటా మోటర్స్ - 2.48 శాతం |
ఓఎన్జీసీ - 0.74 శాతం | రిలయన్స్ ఇండస్ట్రీస్ - 1.90 శాతం |
30 షేర్ల ఇండెక్స్‌లో 10 షేర్లు మాత్రమే స్వల్ప లాభాలను నమోదు చేయగా... 20 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
50 షేర్ల నిఫ్టీ ప్యాక్‌లో 16 షేర్లు లాభాలను, 34 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.