తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటుపోట్ల ట్రేడింగ్​లో.. మిశ్రమంగా ముగింపు - నిఫ్టీ

ఆటుపోట్ల ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్​ 15 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 8 పాయింట్లు బలపడింది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Jun 13, 2019, 4:32 PM IST

ప్రతికూల అంతర్జాతీయ పవనాలతో స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 15 పాయింట్లు క్షీణించింది. చివరకు 39,741 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 8 పాయింట్ల వృద్ధితో 11,914 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

నేడు నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్​ సెషన్ మొత్తం 39,461-39,800 పాయింట్ల మధ్య కదలాడింది.

నిఫ్టీ నేడు 11,931 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,817 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్​ గ్రిడ్​ 1.54 శాతం, ఎం & ఎం 1.33 శాతం, కోటక్ బ్యాంకు 1.33 శాతం, బజాజ్ ఫినాన్స్​ 1.14 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 0.96 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.90 శాతం లాభాలను నమోదు చేశాయి.

బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌.. ఎస్​ బ్యాంకు లెండింగ్ రేటింగ్​కు కోత విధించింది. ఈ నేపథ్యంలో సంస్థ షేరు ఏకంగా 12.96 శాతం నష్టపోయింది. ఇండస్​ఇండ్​ బ్యాంకు 4.96 శాతం, ఇన్ఫోసిస్ 1.49 శాతం, మారుతి 1.03 శాతం, వేదాంత 1.03 శాతం, హీరో మోటోకార్ప్​ 0.95 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details