తెలంగాణ

telangana

ETV Bharat / business

బుల్ జోరు - నూతన గరిష్ఠాలకు సూచీలు - నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. నేటి వృద్ధితో జీవనకాల గరిష్ఠాలను తాకాయి సూచీలు. సెన్సెక్స్ 330 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 85 పాయింట్లు బలపడింది.

బుల్ జోరు

By

Published : May 30, 2019, 4:19 PM IST

Updated : May 30, 2019, 5:34 PM IST

నిన్నటి (బుధవారం) నష్టాల తర్వాత స్టాక్​ మార్కెట్లలో నేడు బుల్ జోరు కొనసాగింది. భారీ లాభాలతో జీవనకాల గరిష్ఠాలకు చేరాయి సూచీలు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 330 పాయింట్లు బలపడింది. చివరకు 39,832 వద్ద జీవనకాల అత్యధిక ముగింపు నమోదు చేసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 85 పాయింట్ల వృద్ధితో 11,946 జీవనకాల గరిష్ఠం వద్ద సెషన్​ ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా...

లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​ ఆద్యంతం అదే జోరు కనబరిచింది. సెషన్ మొత్తం 39,501 - 39,912 పాయింట్ల మధ్య కదలాడింది ఈ సూచీ.

నిఫ్టీ నేడు 11,969 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,859 పాయింట్ల కనిష్ఠానికి చేరింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎన్​టీపీసీ 3.44 శాతం, భారతీ ఎయిర్​ టెల్​ 2.33 శాతం, బజాజ్ ఫినాన్స్ 2.07 శాతం, టీసీఎస్​ 1.91 శాతం, ఎస్​ బ్యాంకు 1.88 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.81 శాతం, ఎస్​బీఐ 1.46 శాతం లాభాలను నమోదు చేశాయి.

సన్​ ఫార్మా అత్యధికంగా 2.39 శాతం నష్టపోయింది. ఎంఅండ్​ఎం 1.61 శాతం, ఓఎన్​జీసీ, 1.40 శాతం, ఇండస్ఇండ్​ బ్యాంకు 1.35 శాతం, వేదాంత 1.12 శాతం, టాటా స్టీల్​ 0.85 శాతం, టాటా మోటార్స్ 0.71 శాతం నష్టాల్లో ముగిశాయి.

Last Updated : May 30, 2019, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details