తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆఖరి నిమిషంలో తప్పిన భారీ నష్టం

ఆరంభంలో భారీగా పతనమైనా.. చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి స్టాక్​ మార్కెట్లు. సెన్సెక్స్​ 36 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Apr 30, 2019, 4:12 PM IST

Updated : Apr 30, 2019, 5:23 PM IST

స్టాక్​ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 36 పాయింట్లు క్షీణించి 39,032 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో.. 11,748 వద్ద సెషన్​ ముగించింది.

మేడే, మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు రేపు సెలవు.

ఇవీ కారణాలు

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం బుధవారం వెలువడనుంది. ఈ కారణంగా విదేశీ మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. వీటికి తోడు బ్యాంకింగ్, ఆటోమొబైల్​ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు నేటి నష్టాలకు ప్రధాన కారణాలు. యస్​ బ్యాంకు షేర్ల భారీ పతనం కూడా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి.

మార్కెట్​ నిపుణులు అంచనా వేసినట్లుగానే ఆరంభంలో భారీ నష్టాలతో కలవరపరిచిన మార్కెట్లు.. చివరకు స్వల్ప నష్టాలకే పరిమితమయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్​ 39,105.88 38,753.46
నిఫ్టీ 11,748.75 11,655.90

లాభానష్టాల్లోనివివే

సెన్సెక్స్​లో హెచ్​సీఎల్​టెక్​ అత్యధికంగా 4 శాతం లాభపడింది. ఈ వరుసలో టాటా స్టీల్ 2.10 శాతం, హచ్​డీఎఫ్​సీ 1.77 శాతం, ఇన్ఫోసిస్ 1.74 శాతం, కోల్ ఇండియా 1.34 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.06 శాతం లాభపడ్డాయి.

నష్టాల జాబితాలో యస్​ బ్యాంకు షేర్లు 29.23 శాతం భారీ నష్టాన్ని నమోదు చేశాయి. ఇండస్​ఇండ్​బ్యాంకు 5.21 శాతం, హీరోమోటోకార్ప్​ 3.51 మారుతి 2.54 శాతం, పవర్ గ్రిడ్ 2.36 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

Last Updated : Apr 30, 2019, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details