తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా లాభాల స్వీకరణ... రికార్డులకు గండి - BSE

వరుస లాభాలతో రికార్డులు నెలకొల్పిన స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 135.36 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 34.35 పాయింట్లు కోల్పోయింది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Apr 18, 2019, 4:08 PM IST

Updated : Apr 18, 2019, 5:17 PM IST

స్టాక్​ మార్కెట్ల లాభాల పరంపరకు నేడు బ్రేక్​ పడింది. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 135.36 పాయింట్లు కోల్పోయి.. 39,140.28 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 34.35 పాయింట్ల నష్టంతో 11,752.80 వద్ద ముగిసింది.

ఇవీ కారణాలు:

గత సెషన్లలో వచ్చిన రికార్డు స్థాయి లాభాలు సహా... సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలతో మధ్యంతర లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు మదుపరులు.
ఇతర ఆసియా మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కూడా నేటి నష్టాలకు కారణం.

ఇంట్రాడే సాగిందిలా..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్​ 39,487.45 (జీవనకాల గరిష్ఠం) 39,083.16
నిఫ్టీ 11,856.15 (జీవనకాల గరిష్ఠం) 11,738.50

లాభనష్టాల్లోనివివే...

రిలయన్స్ ఇండస్ట్రీస్​ గత ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలు నేడు ప్రకటించనుంది. ఫలితాలపై సానుకూల అంచనాలతో సంస్థ షేర్లు 2.79 శాతం లాభాపడ్డాయి. ఈ వరుసలో టాటామోటార్స్​ (2.79 శాతం), ఏషియన్ పెయింట్స్​ (0.77 శాతం) టీసీఎస్ (0.61 శాతం), కోల్​ ఇండియా (0.22 శాతం) లాభపడ్డాయి.

యస్ బ్యాంకు (4.18 శాతం) వేదాంత (3.51 శాతం), ఇండస్ఇండ్​ బ్యాంకు (2.86 శాతం), టాటా స్టీల్ (1.77 శాతం)​, ఎల్​ అండ్​ టీ (1.57 శాతం), ఎస్​బీఐ (1.56 శాతం) నష్టాలను నమోదు చేశాయి.

30 షేర్ల ఇండెక్స్​లో 8 షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేయగా... 22 షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 19 షేర్లు లాభాల్లో... 31 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు జపాన్​ సూచీ నిక్కీ, కొరియా సూచీ కోస్పీ, చైనా సూచీలు నష్టాల్లో ముగిశాయి.

రూపాయి, ముడిచమురు

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 5 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​ విలువ 69.55 రూపాయలుగా ఉంది.

ముడి చమురు ధరల బ్రెంట్ సూచీ ​ 0.17 శాతం తగ్గింది. బ్యారెల్​ ముడి చమురు ధర 71.50 డాలర్లకు చేరింది.

Last Updated : Apr 18, 2019, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details