తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్ల దూకుడు-జీవనకాల గరిష్ఠాలకు సూచీలు

స్టాక్​ మార్కెట్లు నేడు భారీ లాభాలతో జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్​ 623 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 187 పాయింట్లు వృద్ధి చెందింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : May 24, 2019, 4:11 PM IST

Updated : May 24, 2019, 4:58 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు రయ్​రయ్​ మంటూ దూసుకుపోయాయి. నిన్న వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభంజనమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సుస్థిర ఆర్థిక విధానాలు కొనసాగుతాయనే నమ్మకంతో మదుపరులు కొనుగోళ్లపై ఆసక్తి చూపారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 623 పాయింట్లు లాభ పడింది. ఫలితంగా 39,435 పాయింట్లతో జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 187 పాయింట్ల వృద్ధితో.. 11,844 జీవనకాల గరిష్ఠాల వద్ద సెషన్​ ముగించింది.

లాభనష్టాల్లో ఉన్నవివే..

ఐసీఐసీఐ బ్యాంకు 5.09 శాతం, ఎల్​ అండ్​ టీ 4.60 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 4.42 శాతం, వేదాంత 4.20 శాతం, టాటా మోటార్స్​ 4.09 శాతం, ఎం అండ్​ ఎం 3.82 శాతం లాభాలను నమోదు చేశాయి.

ఎన్​టీపీసీ 0.54 శాతం, టీసీఎస్​ 0.20 శాతం, హెచ్​యూఎల్​ 0.10 శాతం నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ మూడు షేర్లు మాత్రమే నష్టపోయాయి.

ఇంట్రాడేలో ఇలా..

ఇంట్రాడేలో 38,824- 39,476 (జీవనకాల గరిష్ఠం) పాయింట్ల మధ్య కదలాడింది సెన్సెక్స్.

నిఫ్టీ నేటి ఇంట్రాడేలో 11,859 పాయింట్ల వద్దజీవనకాలగరిష్ఠాన్ని తాకింది. ఓ దశలో ఈ సూచీ 11,658 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

అమెరికా-చైనా వాణిజ్య భయాల నేపథ్యంలో ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.

Last Updated : May 24, 2019, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details