తెలంగాణ

telangana

ETV Bharat / business

హుర్రే... భయాలున్నా లాభాలొచ్చే

స్టాక్​ మార్కెట్లు ఎట్టకేలకు పది రోజుల తర్వాత లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 228 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 74 పాయింట్లు బలపడింది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : May 14, 2019, 4:08 PM IST

Updated : May 14, 2019, 5:23 PM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలున్నా స్టాక్​ మార్కెట్లు నేడు లాభాలను నమోదు చేశాయి. వరుసగా తొమ్మిది సెషన్ల భారీ నష్టాల తర్వాత పదవ సెషన్లో సూచీలు మెరిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 228 పాయింట్లు బలపడింది. చివరకు 37,318 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 74 పాయింట్లు పుంజుకుని తిరిగి 11,200 స్థాయిని దాటింది. 11,222 వద్ద ట్రేడింగ్​ ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 36,956.10 పాయింట్ల నుంచి 37,572.70 పాయింట్ల మధ్య కదలాడింది.

నిఫ్టీ ఇంట్రాడేలో 11,294.75 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,108.30 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.

ఇవీ కారణాలు

ఫార్మా, ఆర్థిక, విద్యుత్​ రంగాల సానుకూల ప్రభావం నేటి లాభాలకు ప్రధాన కారణం. ముఖ్యంగా సెన్సెక్స్​లో హెవీ వెయిట్​ షేర్లయిన రిలయన్స్​, ఐటీసీ, ఎస్​బీఐలు లాభాలకు ఊతమిచ్చాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు.

నేడు వెలువడిన టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు సానుకూలంగా ఉండటమూ కలిసొచ్చింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు మిడ్​ సెషన్​ తర్వాత ట్రేడింగ్​పై అంతగా ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు నిపుణులు.

లాభనష్టాలు

సెన్సెక్స్​లో సన్ ఫార్మా 5.87 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 5.40 శాతం మేర భారీ లాభాలను ఆర్జించాయి. వేదాంత 4.08 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.58 శాతం, ఎస్​బీఐ 2.33 శాతం, రిలయన్స్​ 2.33 శాతం, టాటా మోటార్స్ 2.27 శాతం లాభపడ్డాయి.

టెక్ దిగ్గజం టీసీఎస్​ 1.72 శాతం, హెచ్​సీఎల్​ టెక్​ 1.56 శాతం, బజాజ్​ ఫినాన్స్​ 1.52 శాతం, బజాజ్ ఆటో 0.92 శాతం, ఇన్ఫోసిస్ 0.86 శాతం, ఏషియన్ పెయింట్స్​ 0.82 శాతం నష్టపోయాయి.

రూపాయి

ఇంట్రాడేలో రూపాయి 13 పైసలు పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ 70.38కి చేరింది.

ముడి చమురు

పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.94 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమురు ధర 70.89 డాలర్లుగా నమోదైంది.

Last Updated : May 14, 2019, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details