తెలంగాణ

telangana

ETV Bharat / business

యుద్ధం భయాలు, నిరాశాజనక ఫలితాలతో నష్టాలు

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రరూపు దాల్చుతుందన్న ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలూ నిరుత్సాహ పరిచాయి. ఫలితంగా స్టాక్​మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

కొనసాగిన భయాలు

By

Published : May 7, 2019, 4:15 PM IST

Updated : May 8, 2019, 7:06 AM IST

వరుసగా ఐదో సెషన్​లోనూ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 323.71 పాయింట్ల భారీ పతనానంతో 38,276.63 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 100 పాయింట్లు క్షీణించి 11,497.90 వద్ద ముగిసింది.

ఇవీ కారణాలు

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు మదుపరుల సంటిమెంట్​ను ప్రభావితం చేశాయి. 200 మిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటన చేశారు.

ఈ సుంకాలు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య ఇంకా ఎలాంటి చర్చలు జరగని కారణంగా మదుపరులు ముందు జాగ్రత్త వహించారు.

చైనా వాణిజ్య ప్రతినిధులు అమెరికా వెళ్లనున్నట్లు అధికారికంగా వెల్లడైనప్పటకీ.. చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది తేలలేదు.

ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరించింది. ఈ ప్రకటన మదుపర్ల ఆందోళనల్ని మరింత పెంచింది.

కార్పొరేట్​ ఫలితాలు అశించిన స్థాయిలో లేకపోవడం నష్టాలకు మరో కారణం

ఇంట్రాడే సాగిందిలా

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 38,835.54 38,236.18
నిఫ్టీ 11,657.05 11,484.45

లాభనష్టాలు

సెస్సెక్స్​లో ప్రధాన షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా టాటా మోటార్స్​ 4.60 శాతం, ఐసీఐసీఐ​ బ్యాంకు 3.77 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 3.10 శాతం, రిలయన్స్​ 2.91 శాతం, వేదాంత 2.07 శాతం ఏషియన్​ పెయింట్స్​ 1.93 శాతం నష్టపోయాయి.

హెచ్​యూఎల్​ 1.37 శాతం, ఎల్ ఆండ్​ టీ 1.14 శాతం, పవర్​ గ్రిడ్​ 0.84 శాతం, ఇన్ఫోసిస్ 0.79, ఓఎన్​జీసీ 0.73 శాతం, బజాజ్​ ఆటో 0.20 శాతం లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్​లో కేవలం ఈ ఆరు షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు ఫ్లాట్​గా ముగిసింది. ప్రస్తుతం డాలర్​తో రూపాయి మారకం విలువ 69.39 వద్దకు చేరింది.

ముడి చమరు ధరల చూచీ బ్రెంట్ 0.74 శాతం తగ్గింది. ఫలితంగా బ్యారెల్​ ముడి చమురు ధర రూ.70.71 డాలర్లకు చేరింది.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు జపాన్​ సూచీ నిక్కీ, దక్షిణ కొరియా సూచీ కోస్పిలు నష్టాలతో ముగిశాయి. చైనా సూచీలు మాత్రం లాభాలను నమోదు చేశాయి.

ఐరోపా మార్కెట్లూ నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Last Updated : May 8, 2019, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details