వారంలో చివరి సెషన్‌ను స్వల్ప నష్టాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 18.17 పాయింట్లు నష్టపోయింది. సెషన్ ముగిసే సమయానికి 38,963.26 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12.50 పాయింట్లు క్షీణించింది. సెషన్ ముగిసే సమయానికి 11,712.25కు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 39,172.76 | 38,920.17 |
నిఫ్టీ | 11,770.90 | 11,699.35 |
ఇవీ కారణాలు:
ఆంరంభంలో లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ముఖ్యంగా కాగ్నిజెంట్ ఆదాయ వృద్ధి అంచనాను 3.6-5.1 శాతానికి సవరించింది. ఏప్రిల్‌లో ప్రకటించిన 7-9 శాతం వృద్ధితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఈ కారణంగా కంపెనీ షేర్లు డీలా పడ్డాయి. వీటి ప్రభావం ఐటీ రంగంపై పడింది.
లాభనష్టాల్లోనివివే..
సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 3.11 శాతం లాభాలను నమోదు చేసింది. ఎన్టీపీసీ 1.99 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.84 శాతం, టాటా మోటార్స్ 1.13 శాతం, యెస్ బ్యాంకు 1.04 శాతం, ఓఎన్జీసీ 0.97 శాతం లాభాలను అర్జించాయి.
టీసీఎస్ అత్యధికంగా 3.70 శాతం నష్టపోయింది. హెచ్‌యూఎల్ 2.20 శాతం, టాటా స్టీల్ 1.31 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.09 శాతం, ఇన్ఫోసిస్ 0.84 శాతం, బజాజ్ ఫినాన్స్ 0.64 శాతం నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు దక్షిణ కొరియా సూచీ కోస్పి, హాంకాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ మిశ్రమంగా ముగిశాయి. జపాన్, చైనా ఎక్స్చేంజిలు నేడు సెలవులో ఉన్నాయి.
రూపాయి, ముడిచమురు
నేటి ట్రేడింగ్‌లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. ప్రస్తుతం డాలర్ పోలిస్తే రూపాయి మారకం విలువ 69.34కు చేరింది.
ముడి చమురు ధరల బ్రెంట్ సూచీ 0.62 శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర 70.31 డాలర్లకు చేరింది.