తెలంగాణ

telangana

ETV Bharat / business

సుస్థిర విధానాలపై ఆశలతో సానుకూల ట్రేడింగ్​ - సెన్సెక్స్​

మోదీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు  సానుకూలంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ ప్రస్తుతం 97 పాయింట్లు బలపడగా.. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

మార్కెట్లు

By

Published : May 24, 2019, 9:50 AM IST

Updated : May 24, 2019, 10:49 AM IST

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి పాలనా పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో మదుపరులు సానుకూలంగా స్పందిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 97 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 38,908 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,682 వద్ద కొనసాగుతోంది.

ఎన్డీఏ విజయంతో..

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో స్థిరమైన ఆర్థిక విధానాలను కొనసాగించడం సహా ఆర్థిక వృద్ధికి దోహదపడే నూతన విధానాలను ప్రభుత్వం తీసుకువస్తుందనే అంచనాలున్నాయి.

స్వల్పకాలంలో సూచీలు కొంత సర్దుబాటుకు లోనైనప్పటికీ దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు వస్తాయంటున్నారు నిపుణులు. స్వదేశీ సహా విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

లాభనష్టాల్లోనివివే..

ఎల్అండ్​టీ, భారతీ ఎయిర్​టెల్, ఎంఅండ్​ఎం, హీరో మోటోకార్ప్​, ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్​, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఓఎన్​జీసీ, బజాజ్ ఆటో, హిందూస్థాన్ యూనిలీవర్​, రిలయన్స్​, కోల్ ఇండియా, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 23 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.78 వద్ద ఉంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 1.21 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 68.57 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన చైనా సూచీ, జపాన్​ సూచీ-నిక్కీ, దక్షిణ కొరియా సూచీ-కోస్పీలు నష్టాలతో నేటి సెషన్​ను ప్రారంభించాయి.

Last Updated : May 24, 2019, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details