తెలంగాణ

telangana

ETV Bharat / business

కీలక గణాంకాల ముందు.. ఆచి తూచి - సెన్సెక్స్​

స్టాక్ మార్కెట్లు నేడు లాభ నష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. సెన్సెక్స్​ 58 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప వృద్ధి చెందింది. కీలక గణాంకాల ముందు మదుపరులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లు

By

Published : Jun 11, 2019, 10:09 AM IST

Updated : Jun 11, 2019, 10:19 AM IST

స్టాక్​ మార్కెట్లు నేడు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. సెషన్ ప్రారంభం నుంచే లాభానష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి సూచీలు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ దాదాపు 58 పాయింట్లు పుంజుకుంది. ప్రస్తుతం 39,842 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,935 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

విశ్లేషణ

రేపు వెలువడనున్న పరిశ్రమల ఉత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు బ్యాంకింగేతర ఆర్థిక రంగాల సంక్షోభం మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.

లాభనష్టాల్లోనివివే..

ఇండస్ఇండ్ బ్యాంకు, ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​ టెక్, టాటా మోటార్స్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, పవర్ గ్రిడ్​, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

సన్​ ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోల్​ ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి, ముడిచమురు

సెషన్ ప్రారంభంలో రూపాయి 16 పైసలు బలపడింది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.49 వద్ద ట్రేడవుతోంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 0.32 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 62.49 డాలర్లుగా కొనసాగుతోంది.

ఇదీ చూడండి: 'వార్తలు వారివి... కోట్ల డాలర్లు గూగుల్​వి'

Last Updated : Jun 11, 2019, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details