తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ప్రారంభమైనా... వెంటాడుతున్న భయాలు - సెన్సెక్స్

నిన్నటి భారీ నష్టాల నుంచి తేరుకుని...నేటి సెషన్​ను స్వల్ప లాభాలతో ప్రారంభించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 138 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 37 పాయింట్లు వృద్ధి చెందింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Jun 18, 2019, 10:32 AM IST

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ఆందోళనలు, వాణిజ్య యుద్ధ భయాలతో మదుపరులు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 138 పాయింట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం 39,098 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 11,709 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

ఇవీ కారణాలు

నేడు జరగనున్న అమెరికా ఫెడ్ సమీక్షా సమావేశం మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేసింది. ఫెడ్​ కీలక వడ్డీ రేట్ల నిర్ణయం రేపు వెలువడనుంది. వీటితో పాటు భారత్​-అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

లాభనష్టాల్లోనివివే..

ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, ఇండస్​ఇండ్​ బ్యాంకు, హెచ్​సీఎల్​ టెక్, వేదాంత, ఎం&ఎం, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్​టీపీసీ, బజాజ్ ఫినాన్స్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎస్​ బ్యాంకు, టాటా స్టీల్​, ఏషియన్​ పెయింట్స్, హెచ్​యూఎల్​, ఎస్​బీఐ, రిలయన్స్​, మారుతి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​ ప్రారంభంలో రూపాయి 9 పైసలు వృద్ధి చెందింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 60.88 వద్ద ట్రేడవుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.10 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు 60.88 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: జెట్​ను ఎన్​సీఎల్​టీకి అప్పగించాలని ఎస్​బీఐ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details