వారంలో చివరి సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి స్టాక్ మార్కెట్లు. బ్యాంకింగ్, వాహన రంగాలు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
నేడు టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 136 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 39,605 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 11,866 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.