తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్ప లాభాలతో గట్టెక్కిన సెన్సెక్స్- ఫ్లాట్​గా నిఫ్టీ - సెన్సెక్స్

భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కాస్త తేరుకున్నాయి. సెన్సెక్స్ 10.25 పాయింట్లు బలపడింది. నిఫ్టీ మాత్రం 2.70 పాయింట్ల స్వల్ప నష్టంతో సెషన్ ముగించింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Jul 9, 2019, 4:15 PM IST

Updated : Jul 9, 2019, 4:57 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ముగిశాయి. చమురు, సహజ వాయువు, వైద్య​ రంగాల్లో నమోదైన లాభాలతో సూచీలు కాస్త కుదుటపడ్డాయి. ముఖ్యంగా రిలయన్స్, ఎల్​&టీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 10.25 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 38,730.82 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 2.70 పాయింట్లు కోల్పోయి 11,555.90 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా...

సెన్సెక్స్ నేడు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. సెషన్ మొత్తం​ 38,436- 38,814 పాయింట్ల మధ్య కదలాడింది ఈ సూచీ.
నిఫ్టీ నేడు 11,582 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఒకానొక దశలో 11,461 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫినాన్స్ 5.60 శాతం, సన్​ ఫార్మా 5.28 శాతం, హీరో మోటార్స్ 3.14 శాతం, ఎల్​&టీ 2.44 శాతం, రిలయన్స్ 2.20 శాతం, భారతీ ఎయిర్​టెల్ 1.70 శాతం లాభపడ్డాయి.

టీసీఎస్ నేడు 2019-20 తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో.. సంస్థ షేర్లు అత్యధికంగా 2.05 శాతం నష్టపోయాయి.

ఎస్​ బ్యాంకు 1.88 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 1.88 శాతం, ఐటీసీ 1.53 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.44 శాతం, మారుతీ 1.43 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి సెషన్​లో రూపాయి ఫ్లాట్​గా ముగిసింది. డాలర్​తో మారకం విలువ 68.64 డాలర్ల వద్ద ఉంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.39 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 64.36 డాలర్లుగా ఉంది.

Last Updated : Jul 9, 2019, 4:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details