స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందనే అంచనాలు నేటి లాభాలకు ప్రధాన కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 70 పాయింట్లు పుంజుకుంది. చివరకు 40,357 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 23 పాయింట్ల వృద్ధితో..11,895 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,650 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,308 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,973 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,879 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.