తెలంగాణ

telangana

ETV Bharat / business

త్వరలో...జీడీపీ గణించేందుకు నూతన ఆధార సంవత్సరం!

జీడీపీని గణించడానికి ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ఆధార సంవత్సరం 2011-12ను త్వరలోనే మార్చాలని కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. జాతీయ- అంతర్జాతీయ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

త్వరలో...జీడీపీ గణించేందుకు నూతన ఆధార సంవత్సరం!

By

Published : Nov 5, 2019, 8:38 PM IST

స్థూల దేశీయ ఉత్పత్తిని గణించడానికి ఇప్పటి వరకు అనుసరిస్తున్న ఆధార సంవత్సరాన్ని త్వరలోనే మార్చాలని కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఇదే జరిగితే.. ఇప్పటి వరకు జీడీపీని గణించడానికి వినియోగిస్తున్న 2011-12 ఆధార సంవత్సరం మారనుంది.

నూతన ఆధార సంవత్సరం

గణాంక మంత్రిత్వశాఖ 2017-18ని కొత్త ఆధార సంవత్సరంగా పరిగణించాలని యోచిస్తోంది. అయితే దీనిపై పూర్తిగా నిర్ధారించుకోవడానికి మరింత సమాచారం అవసరమని నిపుణుల కమిటీలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

జాతీయ-అంతర్జాతీయ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని ఎమ్​ఓఎస్​పీ(మినిస్ట్రీ ఆఫ్​ స్టాటిస్టిక్స్​ అండ్​ ప్రోగ్రామింగ్​ ఇంప్లిమెంటేషన్​) కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ.. ఎఫ్​ఐసీసీఐ సమావేశం సందర్భంగా పేర్కొన్నారు.

"మరికొద్ది నెలల్లో జీడీపీ గణించే ఆధార సంవత్సరాన్ని మార్చాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మేము పరిశ్రమల వార్షిక నివేదికలు, వినియోగదారుల వ్యయ నివేదికల కోసం ఎదురుచూస్తున్నాం. దీని కోసం అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. చివరిగా అన్ని నివేదికలను సంబంధిత కమిటీల ముందు ఉంచుతాం."-ప్రవీణ్ శ్రీవాస్తవ, ఎమ్​ఓఎస్​పీ కార్యదర్శి

అది మంచి సంవత్సరం కాదని...

ఇంతకు ముందు ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి 2009-10కి మార్చాలని గణాంక మంత్రిత్వశాఖ భావించిందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే ఆ ఏడాది కాలంలో భారత్​ సహా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు మెరుగైన స్థితిలో లేవని నిపుణులు సూచించారు. అందుకే 2011-12... జీడీపీని గణించే అధార సంవత్సరంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు.

జీడీపీ గణించే ఆధార సంవత్సరాన్ని మార్చడం వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో మార్పు వస్తుందని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details