ఇటీవల వరుస లాభాలతో సరికొత్త రికార్డులు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలతో ముగిశాయి. ఆర్థిక వృద్ధి భయాలతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు మదుపరులు. 2019-20 రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు 5 శాతం కన్నా తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 336 పాయింట్లు కోల్పోయింది. చివరకు 40,794 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో..12,056 వద్దకు చేరింది.
ఈ వారం మొత్తం మీద.. సెన్సెక్స్ 434 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 142 పాయింట్లు పుంజుకుంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,143 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. 40,664 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.