తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దుపై ఆశలతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు - నేటి స్టాక్ మార్కెట్లు

రేపు పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. నేటి ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 171 పాయింట్ల వృద్ధితో ట్రేడవుతోంది. నిఫ్టీ 51 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది.

stocks
స్టాక్ మార్కెట్లు

By

Published : Jan 31, 2020, 9:41 AM IST

Updated : Feb 28, 2020, 3:16 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. కేంద్రం రేపు వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారీ సంస్కరణలు ఉండొచ్చనే అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 171 పాయింట్లకు పైగా లాభంతో.. 41,085 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 51 పాయింట్లకు పైగా వృద్ధితో 12,086 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

కోటక్ బ్యాంక్​, బజాజ్ ఆటో, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఎం&ఎం, భారతీఎయిర్​టెల్, హీరోమోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​టెక్​, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:పోరు బాట: నేడూ, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Last Updated : Feb 28, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details