తెలంగాణ

telangana

ETV Bharat / business

సెన్సెక్స్ 125 పాయింట్లు వృద్ధి​.. ఎస్ బ్యాంక్​​ దూకుడు - నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, వాహన రంగాల సానుకూలత నేటి లాభాలకు ప్రధాన కారణం. సెన్సెక్స్ 125 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 33 పాయింట్లు వృద్ధి చెందింది. ఎస్​ బ్యాంకు అత్యధికంగా 13 శాతం లాభపడింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 11, 2019, 4:20 PM IST

Updated : Sep 30, 2019, 6:01 AM IST

బ్యాంకింగ్, వాహన రంగాల సానుకూలతలతో స్టాక్​ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఆటో మెుబైల్​ రంగ సంక్షోభానికి పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల​ ఓ సమావేశంలో తెలిపారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఆటోమొబైల్ రంగానికి భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 125 పాయింట్లు పుంజుకుంది. చివరకు 37,271 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11,036 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్​ 37,343 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,194 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,055 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,012 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

నేటి ట్రేడింగ్​లో ఎస్ బ్యాంకు (13.47 శాతం), టాటా మోటార్స్ (10.21 శాతం) అత్యధిక లాభాలను నమోదు చేశాయి. మారుతీ 4.18 శాతం, టాటా స్టీల్​ 3.85 శాతం, వేదాంత 3.44 శాతం, ఇండస్​ఇండ్ బ్యాంకు​ 2.83 శాతం లాభాలను ఆర్జించాయి.

ఓఎన్​జీసీ 3.17 శాతం, హెచ్​సీఎల్​టెక్ 2.48 శాతం, ఎన్​టీపీసీ 1.74 శాతం, సన్​ఫార్మా 1.57 శాతం, టీసీఎస్​ 1.34 శాతం, పవర్​ గ్రిడ్ 1.33 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.​

ఇదీ చూడండి: మీ 'బాస్'​కన్నా మీరే సమర్థంగా పని చేయగలరా...?

Last Updated : Sep 30, 2019, 6:01 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details