తెలంగాణ

telangana

ETV Bharat / business

అమ్మకాల ఒత్తిడి.. వారాంతంలో మార్కెట్లకు నష్టాలే - భారీ నష్టాలు

వారంలో చివరి సెషన్​ను భారీ నష్టాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ ఏకంగా 407 పాయింట్లు కోల్పోయింది. నిప్టీ 108 పాయింట్లు పతనమైంది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Jun 21, 2019, 4:14 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో ప్రారంభం నుంచే నష్టాల్లో ట్రేడయిన సూచీలు.. ఏ దశలోను కోలుకోలేదు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయని నిపుణులు అంటున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 407 పాయింట్లు కోల్పోయింది. చివరకు 39,194 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 107 పాయింట్ల నష్టంతో 11,724 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా...

సెన్సెక్స్ సెషన్​ ట్రేడింగ్​లో 38,121-39,608 పాయింట్ల మధ్య కదలాడింది. నిఫ్టీ 11,828 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,705 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎస్​బీఐ 1.28 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.55 శాతం మేర లాభపడ్డాయి. వేదాంత, ఎన్​టీపీసీ, ఎం&ఎం, యాక్సిస్​ బ్యాంకు లాభాల జాబితాలో ఉన్నాయి.

యస్​ బ్యాంకు అత్యధికంగా 4.36 శాతం నష్టాన్ని మూటగట్టుకుంది. మారుతి 3.39, హెచ్​డీఎఫ్​సీ 2.63, హీరో మోటార్స్ 2.17, హెచ్​యూఎల్​ 2.04 శాతం మేర నష్టపోయాయి.

రూపాయి, ముడిచమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి 11 పైసలు తగ్గింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 69.55గా ఉంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.51 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 64.78 వద్ద ఉంది.

ఇదీ చూడండి: ఇరాన్​పై ప్రతీకార దాడి యోచనలో అమెరికా?

ABOUT THE AUTHOR

...view details