తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధిపై అనుమానాలు... నష్టాల్లో సూచీలు - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 100 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై నెలకొన్న అనుమానాలే ఇందుకు కారణం.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Jul 2, 2019, 10:27 AM IST

ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందన్న ఆందోళనల మధ్య దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతోపాటు బడ్జెట్​కు ముందు మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడం నష్టాలకు మరో కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 100 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం 39,586 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,834 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

లాభనష్టాల్లోనివివే..

ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్​, రిలయన్స్, పవర్​ గ్రిడ్​, మారుతి, టాటా స్టీల్​ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఎస్​ బ్యాంకు, టాటా మోటార్స్, సన్​ ఫార్మా, హీరో మోటార్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి 9పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.03 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.20 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 69.03 వద్ద కొనసాగుతోంది.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై సూచీ, హాంకాంగ్ సూచీ-హాంగ్​ సెంగ్​, దక్షిణ కొరియా సూచీ కోస్పీ, జపాన్ సూచీ-నిక్కీలు మిశ్రమంగా ట్రేడింగ్ ప్రారంభించాయి.

ఇదీ చూడండి: 'అలా జరిగితే రెండంచెల జీఎస్టీ సాధ్యమే!'

ABOUT THE AUTHOR

...view details